FbTelugu

బిజెపిలో ఇమడలేకపోయా: ముకుల్ రాయ్

కొలకతా: ఒకప్పటి టిఎంసి నాయకుడు తాజా బిజెపి నాయకులు ముకుల్ రాయ్ సొంత గూటికి చేరుకున్నారు. ఇవాళ ఆయన సిఎం కుమారి మమతా బెనర్జీ సమక్షంలో తిరిగి టిఎంసిలో చేరారు.

ఆయన కుమారుడు సుభ్రంగ్సు రాయ్ టిఎంసి తీర్థం పుచ్చుకున్నా. మమతా ఆహ్వానించగా, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కుమారి మమత మాట్లాడుతూ, ఇతరుల మాదిరిగా ముకుల్ రాయ్ దేశద్రోహి కాదని, అంకిత భావంతో పనిచేసే నాయకుడన్నారు. 2017లో పార్టీని వీడిన ఆయన తిరిగి టిఎంసిలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ముకుల్ రాయ్ మాట్లాడుతూ, సొంతగూటికి చేరుకున్న ఆయన పాత మిత్రులను చూసి సంతోషపడ్డారు. బిజెపిని వీడిన తరువాత చాలా సంతోషంగా ఉందని, జైలు నుంచి బయటపడినట్లుగా ఉందన్నారు. టిఎంసి వీడి బిజెపిలో చేరినప్పటికీ అక్కడ ఇమడలేకపోయానని ఆయన వ్యాఖ్యానించారు. కుమారి మమతతో తనకెలాంటి విభేధాలు లేవని ముకుల్ రాయ్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.