చెన్నై: దేశీయ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైన్మన్ రతన్ టాటా పేరుతో బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్ లో నటించే వారిపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ ఉంది.
అయితే ఈ సినిమాలో ఒకప్పటి లవర్ బాయ్ మాధవన్ నటిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మాధవన్ అభిమానులు కూడా సంబురపడ్డారు. దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మాధవన్ స్పందించక తప్పలేదు. హే… దురదృష్టవశాత్తు ఇది నిజం కాదు. కొంత మంది అభిమానులు తమ కోరిక మేరకు ఈ పోస్టు సృష్టించారని, నేను నటించడం లేదంటూ మాధవన్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టు కూడా తన వద్దకు రాలేదని, దర్శకుడు చర్చించలేదని ఆయన అన్నారు.
రతన్ టాటా జీవిత కథ ఆధారంగా బయోపిక్ మువీ తీస్తున్నట్లు దర్శకురాలు కొంగర సుధ తెలిపారు ఇటీవలే. అప్పటి నుంచి మాధవన్ నటిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.