FbTelugu

బెంగాల్ బిజెపి ఓటమికి నాదే పూర్తి బాధ్యత!

కొలకతా: పశ్చిమ బెంగాల్ లో విజయం దిశగా తృణముల్ కాంగ్రెస్ పార్టీ దూసుకు పోతున్నది. బెంగాల్ లో బిజెపి ఓటమికి తానే పూర్తి బాధ్యత తీసుకుంటానని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పష్టం చేశారు.

ఇప్పటికి తాము గెలుస్తామన్న ఆశాభావం ఉందని, కౌంటింగ్ కొనసాగుతోంది చూద్దాం అంటూ ఆయన మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. టోలీ గంజ్ లో బిజెపి అభ్యర్థి బాబుల్ సుప్రియో వెనకంజలో ఉండడంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్ఘియా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తం 292 స్థానాలకు గాను 200 స్థానాల్లో తృణముల్ కాంగ్రెస్, 89 స్థానాల్లో బిజెపి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇతరులు మూడు స్థానాల్లో మాత్రమే ముందజలో ఉండడం విశేషం.

You might also like

Leave A Reply

Your email address will not be published.