FbTelugu

హైపర్ లూప్ బోగి అదరహో

గంటకు పన్నెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అత్యాధునిక రైల్వే వ్యవస్థ హైపర్ లూప్ సొంతం. తాజాగా వర్జిన్ హైపర్ లూప్ సంస్థ కొత్త పాడ్ (బోగి) డిజైన్ ను విడుదల చేసింది.

ఈ పాడ్ లో అనేక సౌకర్యాలు సమకూర్చారు. మొబైల్ ఫోన్లు, ట్యాబులు, లాపీలు ఛార్జింగ్ చేసుకునేందుకు వైర్ లెస్ ఛార్జింగ్ ఏర్పాటు చేశారు. సహజ వెలుతురు ను ప్రతిబింబించేలా ఆర్టిఫిషియల్ స్కైలైట్ ను అభివృద్ధి చేశారు. ప్రతి పాడ్ లో 28 మంది విలాసవంతంగా కూర్చుని ప్రయాణం చేయవచ్చు. అయితే ఇందులో ప్రయాణించేందుకు కారు ప్రయాణానికి వెచ్చించే మొత్తం లేదా విమాన ప్రయాణానికన్నా తక్కువగా ఛార్జీలు ఉంటాయని సంస్థ ఇదివరకే ప్రకటించింది. తమ కంపెనీ అభివృద్ధి పరుస్తున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నామని, త్వరలో వాణిజ్య వినియోగం ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.

ముంబై నుంచి పూణే నగరానికి రెండు వందల కిలోమీటర్ల దూరం ఉండగా, కేవలం అరగంట వ్యవధిలో గమ్యస్థానం చేరుకోవచ్చని సంస్థ మిడిల్ ఈస్ట్ అండ్ ఇండియా ఎండీ హర్జ్ దలీవాల్ తెలిపారు. భారత్ లో అనేక ప్రాంతాల్లో ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.