FbTelugu

సుశాంత్ కేసులో హైదరాబాదీ స్టేట్ మెంట్

హైదరాబాద్: నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ అధికారులు హైదరాబాద్ కు చెందిన సిద్ధార్థ పితానీ వాంగ్మూలం సేకరించారు.

ఇప్పటికే ఈ కేసుల విషయంలో పలువురిని ప్రశ్నిస్తున్న సీబీఐ తాజాగా సిద్ధార్థ ను విచారించింది. సుశాంత్ కు సిద్ధార్థ స్నేహితుడు. అయితే విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. చనిపోయిన రోజు (14వ తేదీ రాత్రి) తనతో సుశాంత్ సాధారణంగానే మాట్లాడారని సీబీఐ అధికారులకు తెలిపాడు. రియా ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయిందనే దానిపై కూడా ప్రశ్నించారు. మొత్తానికి సీబీఐ అన్ని కోణాల్లో విచారిస్తూ నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది.

You might also like