FbTelugu

దున్నకు కొమ్రంభీమ్ పేరుపై రగడ

హైదరాబాద్: అటవీ శాఖ అధికారుల అత్యుత్సాహం టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి పెడుతున్నది. నగరంలోని నెహ్రూ జులాజికల్ పార్క్ లో అడవి దున్న బుల్లి దున్నకు జన్మనిచ్చింది.

ఇంత వరకు బాగానే ఉంది. కాని బుల్లి దున్న కు ఆదివాసీల ఆరాధ్య దైవం అయిన కొమ్రం భీమ్ పేరు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న తరువాత ఆదీవాసులు భగ్గుమంటున్నారు. కొమ్రం భీమ్ పేరు వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. వివాదం అయ్యే అవకాశం ఉందని గ్రహించిన అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై పేరును ఉపసంహరించుకున్నారు. అయినా ఆదివాసీలు శాంతించడం లేదు. తమ జాతికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.