FbTelugu

హైదరాబాద్ టూ యూఎస్ నాన్ స్టాప్ ఫ్లైట్

హైదరాబాద్: జనవరి 15నుంచి హైదరాబాద్ నుంచి అమెరికాకు డెరెక్ట్ ఫైట్ సర్వీసు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి చికాగో వరకు నాన్ ఎయిర్ ఇండియా ఫైట్ సర్వీసు జనవరి15న ప్రారంభించనున్నారు.
ఎయిర్ ఇండియా బోయింగ్ 777-200 విమానాన్ని ఈ సర్వీసు కోసం ఉపయోగించనుంది. ఈ విమానం 238 (8ఫస్ట్ క్లాస్+35బిజినెస్ క్లాస్+195ఎకానమీ క్లాస్)సీటింగ్ సామర్థ్యంతో ఉంటుంది. ఏటా 2.2లక్షలకు మందికిపైగా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి అమెరికాకి వెళ్లే వారికి సేవలందించేందుకు ఈ విమానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

హైదరాబాద్ చికాగోలను కలిపే కొత్త నాన్-స్టాప్ మార్గం ఎయిర్ పోర్ట్స్ కనెక్టివిటీ విష్ లిస్ట్ లో కొంతకాలంగా ఉందని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పానికర్ తెలిపారు.
అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ వంటి అమెరికా దిగ్గజాలకు హైదరాబాద్ రెండవ నివాసంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ విమానానికి అపారమైన సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.