FbTelugu

నిమ్స్ లో వ్యాక్సిన్ల గోల్ మాల్

హైదరాబాద్: నిమ్స్ లో ఏడు వేల కరోనా వ్యాక్సిన్ల పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఏ విధమైన నిబంధనలు పాటించకుండా అనర్హులకు వ్యాక్సిన్లు ఇవ్వడంపై దుమారం చెలరేగింది.

నిమ్స్ కు ఎన్ని వ్యాక్సిన్లు వచ్చాయి, ఎంత మందికి ఇచ్చారు, అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనే దానిపై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ కు ప్రభుత్వం ఆదేశించింది. వ్యాక్సిన్ పంపిణీలో గోల్ మాల్ పై డైరెక్టర్ డాక్టర్ మనోహర్ స్పందించారు. వ్యాక్సిన్ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విచారణకు ఆదేశించిందని, విచారణ జరుగుతోందన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి లోతుగా మాట్లాడలేనని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. డిప్యుటి మెడికల్ సూపరింటెండెంట్ కెవి.కృష్ణారెడ్డి పాత్రపైనా దర్యాప్తు జరుగుతోందన్నారు. మార్చి, ఏప్రిల్ నెలలో వ్యాక్సిన్ తీసుకున్నవారి వివరాలు సేకరిస్తున్నామని, ఆధార్ కార్డు లేకుండా వ్యాక్సిన్ ఇస్తే కచ్చితంగా చర్యలు ఉంటాయని గంభీరంగా ప్రకటించారు. నివేదిక ఆధారంగా సర్టిఫికెట్ల జారీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మనోహర్ డైరెక్టర్ అయిన తరువాత నిమ్స్ స్థాయి ఉస్మానియా హాస్పిటల్ కన్నా ఘోరంగా మారిందని విమర్శలు ఉన్నాయి. నోట్లో ఏమాత్రం నాలుక లేని, పరిపాలనా అనుభవం లేని వ్యక్తిని డైరెక్టర్ గా నియమించారంటూ డాక్టర్లే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తలాడించే వ్యక్తిని డైరెక్టర్ గా నియమించారంటూ గుసగుసలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.