FbTelugu

ఉత్తమ నివాసయోగ్య నగరంగా హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దేశంలోనే ఉత్తమ నివాసయోగ్య నగరంగా గుర్తింపు తెచ్చుకుంది. హాలీడేపై.కామ్ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు బయటపడినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెలల మధ్య దేశంలోని 34 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించినట్టు పేర్కొంది. నివాస వసతి, ఉపాధి అవకాశాల ఆధారంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పర్యాటక ప్రాంతాలుగా చార్మినార్, రామోజీ ఫిల్మ్ సిటీ, ఇతర పర్యాటక ప్రాంతాలను ప్రస్తావించినట్టు తెలిపింది.

You might also like