FbTelugu

ఈ సారి ఇళ్లలోనే బోనాల పండుగ: సీపీ

హైదరాబాద్ : ఈ సారి ఇళ్లలోనే బోనాల పండుగ జరుపుకోవాలని హైదరాబాద్ సీపీ(కమిషనర్ ఆఫ్ పోలీస్) అంజనీకుమార్ సూచించారు. ఎవరూ బోనాలతో దేవాలయాలకు రావద్దని తెలిపారు.

ఈ సారి గోల్కొండ, సికింద్రాబాద్ మహంకాళి, లాల్ దర్వాజ దేవాలయాల్లో బోనాల సమర్పణ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదవుతున్న విషయం తెలిసిందే.. ఇలాంటి తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

You might also like