FbTelugu

ఆదాయం లేక ఫైవ్ స్టార్ హోటల్ మూత

ముంబయి: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందనేది క్రమక్రమంగా బయటకు వస్తున్నది. లాక్ డౌన్ కారణంగా పలు రంగాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముంబయి లోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ హయత్ రీజెన్సీ మూతపడింది.

వేతనాలు చెల్లించేందుకు డబ్బులు లేవని, తదుపరి నోటీసువచ్చే వరకు అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం సోమవారం ప్రకటించడంతో సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తన మాతృ సంస్థ ఏషియన్ హోటల్స్ (వెస్ట్) నుంచి నిధులు విడుదల కావడం లేదని, అందుకే జీతాలు కూడా సకాలంలో చెల్లించలేకపోతున్నామని తెలిపింది. నిధుల లభ్యత లేని కారణంగా హోటల్ ను సక్రమంగా నిర్వహించలేని స్థితికి చేరుకుందని ఉద్యోగులకు పంపిన నోటీసులు పేర్కొన్నారు. రూమ్ బుకింగ్ రిజర్వేషన్ తాత్కలికంగా మూసివేశామని హోటల్ వైస్ ప్రెసిడెంట్ సున్జే శర్మ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.