FbTelugu

హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా రిటైర్డు ఐఏఎస్?

వరంగల్: హుజూరాబాద్ నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థిగా ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరును సిఎం కెసిఆర్ పరిశీలన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఐదారుగురు పేర్లు పరిశీలనలోకి వచ్చిన ఈయన వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
హుజూరాబాద్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముద్దసాని దామోదర్ రెడ్డి టిడిపి నుంచి గెలుపొందారు. 2004 నుంచి ఈ నియోజకవర్గం ఈటల రాజేందర్ గెలుపొందుతూ వస్తున్నారు. ఈలోపు దామోదర్ రెడ్డి చనిపోవడం, ఆయన కుమారుడు కశ్యప్ రెడ్డి 2014లో టిడిపి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

దామోదర్ రెడ్డి సోదరుడు పరిశ్రమల శాఖలో పనిచేస్తూ ఐఏఎస్ గా పదోన్నతి పొందారు. 2010లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సందర్భంగా కెసిఆర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. రిటైర్మెంట్ అయిన తరువాత వేములవాడ టెంపుల్ డెవపల్ మెంట్ అథారిటీ (విటిడిఏ) చైర్మన్ గా పనిచేస్తున్నారు. సౌమ్యుడు, మాజీ ప్రభుత్వ అధికారి కావడంతో అత్యధికులు ఈయన పేరు పట్ల సుముఖంగా ఉన్నారు. పురుషోత్తం రెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎ.ప్రవీణ్ రెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.