FbTelugu

భార్య ఆత్మహత్య వీడియోలు తీసిన భర్త

   జైపూర్: ఓ మహిళ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో కాపాడాల్సింది పోయి ఆ మహిళ భర్త తన సెల్ ఫోన్లో వీడియోలు తీసిన దారుణ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లాలో ఓ మహిళ అత్తింటి వారి వేదింపులు తట్టుకోలేక ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ మహిళ భర్త ఆమెను కాపాడాల్సింది పోయి తన సెల్ ఫోన్లో వీడియోలు తీసి మహిళ కుటుంబ సభ్యులకు పంపాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.