FbTelugu

భార్య, కుమార్తెను హతమార్చిన భర్త!

కరీంనగర్ : ఓ వ్యక్తి తన భార్యను, కుమార్తెను అతి దారుణంగా ఇనుపరాడ్డుతో కొట్టి హతమార్చిన దారుణ ఘటన జిల్లాలోని హుజూరాబాద్‌లో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేష్ అనే వ్యక్తి తన భార్య రమ(45), కూతురు ఆమని(25)లతో పట్టణ శివారులోని మధు టాకీస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

వెంకటేశ్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఇవాళ తన భార్యాకూతుర్ని ఇనుప రాడ్డుతో కొట్టి హతమార్చాడు. కుటుంబ కలహాలతో హతమార్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.