FbTelugu

అడ్డుగా ఉన్నాడని భర్తనే కడతేర్చింది!

* భర్త స్నేహితునితో అక్రమ సంబంధం
* భర్తకు తెలిసిపోవడంతో హత్యకు ప్లాన్ వేసిన భార్య
అనంతపురం : ఓ మహిళ తన భర్త స్నేహితునితోనే అక్రమ సంబంధం పెట్టుకొని అడ్డుగా ఉన్న భర్తను ప్రియునితో హత్య చేయించిన ఘటన జిల్లాలోని గుత్తిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటలక్ష్మి, అశోక్ భార్యాభర్తలు. అశోక్ కు యోగి అనే వ్యక్తి బెస్ట్ ఫ్రెండ్ ఈ క్రమంలోనే తరచూ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ తరుణంలోనే భర్త స్నేహితునితో వెంకటలక్ష్మి వివాహేతర బంధం ఏర్పరుచుకుంది.

భార్య ప్రవర్తన చూసిన అశోక్ వార్నింగ్ ఇచ్చాడు. ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని సూచించాడు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని.. తన భర్తను హత్యచేయమని ప్రియుడు యోగికి సూచించింది. మద్యం తాగుదామని ఎప్పటిలాగే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి అశోక్ ను హత్యచేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.