FbTelugu

టిక్‌టాక్ వీడియోలు చేస్తోందని భార్యను చంపిన భర్త!

Husband-killing-wife-for-making-ticktack

ప్రకాశం: ఓ వ్యక్తి తన భార్య టిక్‌టాక్ వీడియోలు వద్దన్నాచేస్తోందని దారుణంగా హతమార్చిన ఘటన జిల్లాలోని కనిగిరి మండలం, తాళ్లూరులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కనిగిరి మండలం, తాళ్లూరుకు చెందిన ఫాతిమా కనిగిరిలో టైలర్ పనిచేసే పాషాను వివాహం చేసుకుంది. ఐతే గత కొంత కాలంగా ఫాతిమాకు టిక్‌టాక్ వీడియోలు చేస్తోంది. ఇది పాషాకు నచ్చలేదు. నలుగురిలో తన పరువుపోతోందని వీడియోలు తీయొద్దని చెప్పాడు. దీంతో ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. అంతే కాకుండా ఫాతిమా వేరే ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందని పాషా అనుమానించడంతో గొడవలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఫాతిమా అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఉరి వేసుకుని చనిపోయిందని మొదట పాషా చెప్పాడు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఫాతిమాను పాషానే హత్య చేసినట్లు తేలింది. బార్యను చపాతి చేసే కర్రతో తలపై కొట్టి, గొంతుపై నొక్కిపట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

You might also like