FbTelugu

భర్త, పిల్లలను ఇంజెక్షన్ తో చంపేసింది

నాగపూర్ లో వైద్యురాలి ఘోరం
నాగపూర్: ఏమైందో ఏమో కాని భర్త, పిల్లలకు మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చి ఆ తరువాత ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నాగపూర్ లో జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం డా.సుష్మా రాణే, ఆమె భర్త ధీరజ్, కుమారుడు, కుమార్తె ఇంట్లోనో విగత జీవులుగా పడి ఉన్నారు. ధీరజ్ కాలేజీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తుండగా, సుష్మా స్థానిక అవంతి హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు.

కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని ఇరుగుపొరుగు వారు, సహచరులు అంటున్నారు.
మంగళవారం ఉదయం తన కుమార్తెతో కలిసి హాస్పిటల్ కు వెళ్లిన ఆమె తిరిగి వచ్చే సమయంలో మత్తు మందు ఇంజెక్షన్లను కొనుగోలు చేసింది. తొలుత భర్త, ఇద్దరు పిల్లలకు ఇవ్వాల్సిన మోతాదు కన్నా అధిక మోతాదులో ఇచ్చింది. వాళ్లు చనిపోయారని నిర్థారించుకున్న తరువాత ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఇంట్లో రెండు ఇంజెక్షన్లు, ఖాళీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న తరువాత మృతదేహాలను పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

You might also like