FbTelugu

కట్టుకున్న భార్యపై భర్త దారుణం

నల్లగొండ: ఓ వ్యక్తి తన భార్యను అతి దారుణంగా కత్తితో పొడిచి హతమార్చిన ఘటన జిల్లాలోని నాంపల్లి మండలం, దేవత్ పల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

యాదమ్మ, నర్సింహ భార్యా భర్తలు. వీరు స్థాని దేవత్ పల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే భార్య యాదమ్మను నర్సింహ అతి దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. కుటుంబ కలహాలతోనే యాదమ్మను హతమార్చినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.