FbTelugu

మొగుడికి కరోనా వచ్చిందని భార్య ఆత్మహత్య

మంచిర్యాల: భర్తకు కరోనా పాజిటివ్ వచ్చిందనే మనోవేదనతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బెల్లంపల్లిలో చోటు చేసుకున్నది. హనుమాన్ బస్తీకి చెందిన సుద్దాల మొండయ్యకు 15 రోజుల క్రితం పాజిటివ్ నిర్థారణ కాగా తగ్గకపోవడంతో హైదరాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ తరలించారు.

ప్రైవేటు హాస్పిటల్ లో ఆయన చికిత్స తీసుకుంటున్నాడు. వారం రోజుల క్రితం మొండయ్య భార్య జలజ కు కరోనా సోకింది. కరోనా సోకిన భర్తకు ఇంకా తగ్గకపోవడంతో మనోవేదన చెందుతున్న ఆమె మంగళవారం అర్థరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మమత్య చేసుకున్నది. ఈ ఘటనపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.