FbTelugu

భార్య బలంగా కొట్టడంతో భర్త మృతి

అనంతపురం: కళ్యాణదుర్గం మున్సిపాల్టీ పరిధిలోని దొడగట్ట గ్రామంలో భార్యాభర్తలు సరిత, శ్రీనివాసులు మధ్య ఆదివారం రాత్రి గొడవ జరిగింది. భర్త ఏదో అనడంతో ఆవేశానికి గురైన భార్య దుడ్డు కర్రతో ఆయనపై దాడి చేసింది.

భార్య బలంగా తగలడంతో సొమ్మసిల్లి కింద పడిపోయాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన భర్త కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. గాబరా చెందిన భర్య ఇరుగుపొరుగువారు, కుటుంబ సభ్యులకు తెలియచేసింది. శ్రీనివాసులు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సరితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.