FbTelugu

భర్తను రోకలిబండతో కొట్టి హత్య

మేడ్చల్‌: ఓ మహిళ తన భర్తను రోకలిబండతో కొట్టి హత్యచేసిన ఘటన జిల్లాలోని కీసర మండలం నాగారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరోజ, శ్యామ్ లు భార్యాభర్తలు. వీరు స్థానిక నాగారంలో నివాసం ఉంటున్నారు.

శ్యామ్ రోజూ ఫుల్లుగా తాగొచ్చి గొడవకు దిగుతుండడంతో.. వేదింపులు తట్టుకోలేక రోకలిబండతో బలంగా మోదింది. దీంతో తీవ్ర గాయాలపాలైన శ్యామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.