FbTelugu

కడప వైసీపీ రెబెల్స్ పై వేటు

కడప: నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు పాటించని వారి పై వైసీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరపాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకున్నది.

నగరంలోని 14, 40, 44 వ డివిజన్ లలో పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు పోటీగా నామినేషన్ వేసిన రెబల్స్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో బూస్ట్ విజయ్ కుమార్, జి.సుధాకర్, ఎం.డి.అల్ఫోన్స్, శివశంకర్(చిట్టిబాబు), వారధి జోసెఫ్, ఉప్పలపాటి భాస్కర్, ఓబుల్ రెడ్డి, కె.చంద్రఓబుల్ రెడ్డి, ఇల్లూరి జయరాజు, వెల్లాల రామకృష్ణ రెడ్డి ఉన్నారు. పార్టీ పదవులు, సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు వాడుకున్నా, నాయకుల పేర్లు ఉపయోగించిన న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు వీరిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.