FbTelugu

తాళి కట్టించుకున్నావ్… పీరియడ్స్ తెచ్చుకో

ముంబయి: ఆడ, మగ సమానం అయినప్పుడు కేవలం మహిళ మాత్రమే ఎందుకు మంగళసూత్రం ధరించాలని ప్రియుడు చెప్పాడు. ఇంకేముంది ప్రియురాలు కూడా అతని ఆలోచన బాగుందంటూ అమలు చేసింది.
ఈ పెళ్లి తంతు ను హ్యూమన్స్ ఆఫ్ బాంబే లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. శార్దూల్, తనూజ ఒకే కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పరిచయం కాస్తా ప్రేమగా మారి పరిణయం వరకు వెళ్లింది. అభ్యదయ భావాలు కలిగిన ఇద్దరు సమానంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. గతేడాది వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఒకరి మెడలో మరొకరు తాళి కట్టాలని నిర్ణయించారు. పురోహితులు తాలి కట్టాలని చెప్పనప్పుడు, శార్ధూల్ తన నిర్ణయాన్ని చెప్పగా, ఇరు కుటుంబాలు ససేమిరా అన్నాయి. కొందరైతే వివాహం నుంచి బయటకు వెళ్లిపోయారు. తనూజ మెడలో శార్ధూల్, ఆయన మెడలో తనూజ తాళి కట్టింది. ఈ అనూహ్య ఘటనను హ్యుమన్స్ బాంబే సంస్థ ఫేస్ బుక్ లో షేర్ చేసింది.

ఈ వీడియో ను చూసిన పలువురు శార్ధూల్ పై విరుచుకుపడుతున్నారు. మగాడిగా పుట్టావు, ఇటువంటి వ్యతిరేక పనులు చేస్తావా అంటూ మండిపడుతున్నారు. ఇక ఎందుకు ఆలస్యం చీర కట్టుకో, నీ భార్యతో కలిసి పీరియడ్స్ కూడా తెచ్చుకో అంటూ భగ్గుమంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.