FbTelugu

త్వరలోనే ఈ-విద్యా విధానం: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీలో చివరి విడతను ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించారు. కరోనా నివారణ చర్యలకు రూ.15 వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు.

దేశంలో త్వరలోనే ఈ-విద్యావిధానం అమలు చేయనున్నట్టు తెలిపారు. విద్యార్థులకు డీటీహెచ్ ల ద్వారా ఆన్ లైన్ తరగతుల కోసం 12 ఛానళ్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నట్టు తెలిపారు. త్వరలోనే టీవీ రేడియోల ద్వారా ఆన్ లైన్ డిజిటల్ క్లాసులు ప్రారంభించనున్నట్టు స్పష్టం చేశారు.

You might also like