FbTelugu

వలస కూలీలపై మానవత్వం చూపాలి: జగన్

అమరావతి: ఇది వలస కూలీలపై మానవత్వం చూపించాల్సిన సమయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఏపీ నుంచి వెళుతున్న వలస కూలీల సహాయక చర్యలపై ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా

సీఎంఓ అధికారులతో ఫోన్ లో మాట్లాడి సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం నుంచి ఒడిషాకు వెళుతున్న 902 మంది వలస కూలీలకు షెల్టర్లు ఇచ్చి బస్సుల్లో పంపించినట్టు తెలిపారు. వలస కూలీలకు భోజనం, సదుపాయాలలో లోటు రాకూడదని సీఎం సూచించారు. ఆ ఖర్చు విషయంలో ఆలోచించవద్దని తెలిపారు.

You might also like