FbTelugu

మానవత్వం మరిచిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్

వికారాబాద్: తాండూర్ నుండి వికారాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సులో ఒక వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేయకుండా డ్రైవర్, కండక్టర్ మానవత్వం మరిచి వ్యవహరించారు.
బస్సును నిలిపివేసిన డ్రైవర్, కండక్టర్ మృతదేహాన్ని కేరెల్లి గ్రామంలో రోడ్డు పక్కన దించేసి వెళ్లిపోయారు. ఈ ఘటనతో ప్రయాణీకులు సైతం విస్తుపోయారు. అయితే సాధరణ మరణమా లేక కరోనాతో చనిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ కరోనాతో మరణిస్తే బస్సులో ప్రయాణం చేస్తున్నవారందరినీ పరీక్షించాల్సి ఉంటుంది.

కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.