FbTelugu

ట్రంప్ మద్దతుదారుల హల్ చల్

వాషింగ్టన్: ఇటీవల జరిగిన అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ పొందిన జోబైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు నిర్వహించిన అమెరికన్ కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్ మద్దతుదారులు హల్ చల్ చేశారు.

ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ మృత్యువాత పడింది. బైడెన్ కు వ్యతిరేకంగా ట్రంప్ మద్దతుదారులు నినాదాలు చేసుకుంటూ క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చారు. మొదట ఈ ఆందోళనకారులపై బాష్పవాయువును ప్రయోగించారు. అయినప్పటికీ వారు వెన్నక్కి తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.