FbTelugu

మద్యం మత్తులో యువతుల హల్ చల్

హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు తాగుబోతులు రోడ్డు మీద అక్కడక్కడ రచ్చ చేసేవారు. ఇప్పుడు యువతులు హల్ చేస్తున్నారు. చైతన్యపురి కనక దుర్గ వైన్స్ పరిసరాల్లో కొంతమంది యువతులు మద్యం మత్తు లో హల్ చల్ చేస్తూ తలనొప్పిగా మారారు.
కొందరు యువతులు వైట్నర్ పీలుస్తూ, మద్యం తాగి వైన్స్ ఎదురుగా ఉన్న బస్ స్టాప్ లో తిష్ట వేస్తున్నారు. మద్యం కొనడానికి వచ్చే వారితో, రోడ్డుపై వెళ్లే వారితో యువతులు ఏ కారణం లేకుండానే గొడవకు దిగుతున్నారు.

కొన్ని సందర్భాల్లో యువతులు రెచ్చిపోతూ దారిన పోయే వారిపై దాడులకు పాల్పడుతూ డబ్బులు లాక్కుంటున్నారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో యువతులు మద్యం మత్తులో వైన్ షాప్ ముందు ఓ యువకుడిపై దాడి చేశారు. అంతే కాకుండా బస్ స్టాప్ లో పడుకొని ఉన్న మరో యువకుడి బట్టలిప్పి డబ్బులు లాక్కున్నారు. వీరి బాధ పడలేక వారిద్దరు భయంతో జారుకున్నారు. రోడ్డుపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

You might also like