FbTelugu

బీరుబాటిల్ తో గొంతు కోసుకుంటూ హల్ చల్

విశాఖపట్నం: ఓ యువకుడు బీరుబాటిల్ ను పగలకొట్టి దాంతో గొంతు కోసుకుంటానంటూ హల్ చల్ చేసిన ఘటన జిల్లాలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మద్యం ఫుల్లుగా తాగేసిన ఓ మందుబాబు స్థానిక అనకాపల్లిలోని నాలురోడ్ల కూడలిలో బీరు సీసాను పగలకొట్టి దాంతో గొంతు కోసుకుంటూ తీవ్ర హల్ చల్ చేశాడు. అతన్ని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అప్పటికే ఆ యువకుడు స్వల్పంగా బీరు బాటిల్ తో గాయపరుచుకున్నట్టు తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.