FbTelugu

పాకిస్థాన్ వ్యక్తినంటూ వ్యక్తి హల్ చల్

తిరుపతి: ఓ వ్యక్తి తాను పాకిస్థాన్ వ్యక్తినంటూ.. హల్ చల్ చేసిన ఘటన జిల్లాలోని శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి స్థానిక శ్రీకాళహస్తిలో తాను పాకిస్థాన్ నుంచి వచ్చానని తనతో పాటూ మరో ముగ్గురు ఉన్నారని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.

అసలే కరోనా వైరస్ నేపథ్యంలో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని తీసుకేళ్లి విచారించారు. అయితే ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని పోలీసులు తెలిపారు.

You might also like