FbTelugu

భారీగా తగ్గిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధరలు

 అమరావతి: కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఈ సందర్భంగా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ల ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కిట్ కు రూ.230 మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అన్ని ల్యాబ్ లూ ఇవే ధరలను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. టెస్టు కిట్లు అందుబాటులోకి వచ్చిన మొదట్లో వీటి ధరలు రూ.2 వేల నుంచి రూ.3 వేల మధ్య ఉండేది. క్రమంగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.