FbTelugu

భారీగా తగ్గిన బంగారం ధరలు

న్యూఢిల్లీ: బంగారం ధరలు ఇవాళ దిగొచ్చాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.700లకు పైగా తగ్గింది.

న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం భారీగా రూ.714 తగ్గి.. రూ.50,335 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా బంగారానికి తగ్గిన డిమాండ్కు అనుగుణంగా దేశీయంగాను ధరలు దిగొస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా వెండి ధర కూడా కిలోకు(న్యూఢిల్లీలో) రూ.386 తగ్గడం కొనుగోలుదారులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం కిలో ధర రూ.69,708 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,916 డాలర్లకు తగ్గగా, వెండి ఔన్సుకు 27.07 డాలర్ల వద్ద ఆగింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.