FbTelugu

ఈ టైములో కూడా భారీ వేతనాలు: సిక్కీ సర్వే

విశాఖపట్నం: కరోనా సమయంలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సర్వేలు తేల్చాయి. సీనియర్ స్థాయి ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచారని సిక్కి అనే సర్వే సంస్థ వెల్లడించింది.

దేశంలో 72 శాతం కంపెనీలు పదేళ్ల అనుభవం ఉన్న సీనియర్లకే పెద్దపీట వేయడంతో పాటు భారీగా వేతనాలు పెంచాయి. సీనియర్ ఉద్యోగులను కొనసాగించడం మూలంగా పని పెరగడంతో పాటు జూనియర్లను నియంత్రంచగలరని తేలింది. కేవలం 28 శాతం కంపెనీలు మాత్రమే జూనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

సిక్కి సర్వే సంస్థ హైదరాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై నగరాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఐటీ నిపుణులు, ప్రముఖ కంపెనీల సీనియర్లు, జూనియర్లు పాల్గొన్నారు.

You might also like