FbTelugu

డీజిల్ పై భారీగా వ్యాట్ తగ్గింపు

న్యూఢిల్లీ : దేశంలో గత కొన్ని రోజులుగాపెట్రోలు డీజిల్ ధరలు తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ తరుణంలోనే దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్‌పై వ్యాట్‌ (వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్)ను 30% నుంచి 16.75 శాతానికి తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.

ప్రస్తుతం ఢిల్లీలో డీజిల్ లీటర్ ధర రూ.82 ఉంది. తాజా వ్యాట్ తగ్గింపుతో లీటరు డీజిల్ 73.64 రూపాయలకే అందుబాటులోకి రానుంది. అంటే లీటరుకు రూ.8.36 లు తగ్గనుంది. ఒక స్థాయిలో పెట్రోలో ధరను డీజిల్ ధర దాటేసింది. ఈ తరుణంలో ఢిల్లీ కేబినెట్ నిర్ణయం వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు.

You might also like