FbTelugu

మంచిర్యాలలో పులి కలకలం

జిల్లాలోని నెన్నెల మండలంలో పెద్దపులి సంచరించి తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకెళితే.. స్థానిక నెన్నెల మండలంలో పులి సంచరించినట్టుగా పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.

దీంతో అప్పమత్తమైన అధికారులు గ్రామస్తులు అడవిలోకి వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. పులి సంచరిస్తుందన్న సమాచారంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు.

You might also like