FbTelugu

సుయెజ్ కాలువలో కదిలిన భారీ నౌక

కైరో: మొజాంబిక్ దేశం సుయెజ్ కాలువలో నౌకల రాకపోకలను అడ్డంకిగా మారిన ఎవర్ గివెన్ నౌక ఎట్టకేలకు మోక్షం లభించింది. అడ్డంకిగా ఉన్న ఈ నౌకను సవ్య దిశలోకి తీసుకురావడంతో ఇంజనీర్లు సఫలీకృతులు అయ్యారు. అత్యంత భారీ నౌక ను సవ్యంగా తీసుకువచ్చేందుకు రాత్రింబవళ్లు పనిచేశారు.

20వేల కంటైనెర్లతో వెళ్తున్న ఎవర్ గివెన్ నౌక నీటిపై తేలియాడేలా చేశారు. దీన్ని పైకి తీసుకువచ్చేందుకు 18మీటర్ల లోతులో దాదాపు 27వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. అంతర్జాతీయ మార్గానికి సుయెజ్ జలమార్గం కీలకమైంది. ప్రపంచ వాణిజ్యంలో పదిశాతం ఈ కాలువ మీదుగానే జరుగుతుంది. ఇంతటి కీలకమైన కాలువలో సోమవారం నుంచి నౌక చిక్కుకుపోవడంతో మిగతా నౌకల రాకపోకలు నిల్చిపోయాయి. సోమవారం ఉదయం నాటికి దాదాపు 450 నౌకలు వేచి ఉన్నాయి. ఆరు రోజులుగా జల రవాణా ఆగిపోవడంతో రోజుకు 9 బిలియన్ డాలర్ల వ్యాపారం స్తంభించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.