FbTelugu

కౌలురైతుల పేరుతో భారీ స్కామ్

తూర్పుగోదావరి: కౌలురైతుల పేరుతో యూనియన్ బ్యాంకులో భారీ స్కామ్ కు పాల్పడిన ఘటన జిల్లాలోని అంబాజీపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైతులకు తెలియకుండానే కొందరు రెవెన్యూశాఖ అధికారులు కౌలురైతు కార్డులు జారీ చేశారు.

వాటితో కొందరు స్థానిక అంబాజీపేటలోని యూనియన్ బ్యాంకులో కౌలురైతుల పేరుతో లక్షల రూపాయల రుణాలను పొందారు. అసలు విషయం తెలుసుకున్న భూ యజమానులు ఒక్కసారిగా హవాక్కయ్యారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.