FbTelugu

హైదరాబాద్ లో భారీగా పాజిటివ్ కేసులు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు కూడా భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇవాళ 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతకు ముందు రోజు అనగా సోమవారం నాడు 79 కేసులు నమోదు అయిన విషయం విదితమే. వరుసగా రెండు రోజుల పాటు అధిక సంఖ్యలో కేసులు పెరగడంతో హైదరాబాద్ వాసులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటి వరకు 1326 పాజిటివ్ కేసులు రాగా, మొత్తం 30 మంది మృతి చెందారు. డిశ్చార్జ్ అయినవారు 822 మంది కాగా ఆక్టివ్ కేసుల సంఖ్య 472 గా ఉంది.

You might also like