FbTelugu

తెలంగాణలో ఠారెత్తిస్తున్న కేసులు

ఒక్కరోజే 55 పాజిటివ్ కేసులు నమోదు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 5 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

గత కొద్దిరోజులుగా హైదరాబాద్ కే పరిమితం అయిన కేసులు మళ్లీ జిల్లాలకు విస్తరించడం కలవరానికి గురిచేస్తోంది. హైదరాబాద్ లో 44 కేసులు నమోదు కాగా మాదన్నపేటలోని ఒక అపార్ట్ మెంట్ లోనే 23 కేసులు వెలుగు చూశాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బర్త్ డే పార్టీ కారణంగా ఒకే అపార్ట్ మెంట్ లో 23 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 1, సంగారెడ్డి 2, వలసదారులకు 8 చొప్పున నమోదు అయ్యాయి. వలసదారుల్లో జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

మొత్తం ఇప్పటి వరకు 1509 కేసులు నమోదు కాగా, 971 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇవాళ 12 మంది కోలుకుని డిశ్చార్జీ కాగా 504 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు.

You might also like