FbTelugu

బెజవాడలో పట్టపగలే భారీ దోపిడి

విజయవాడ: నగరంలోని మాచవరంలో ఒక వైద్యుడి ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది. భార్య, పిల్లలను బెదిరించి రూ.50 లక్షల సొమ్మును ఎత్తుకెళ్లారు.

పోలీసుల తెలిపిన కథనం ప్రకారం సోమవారం డాక్టర్ మురళీధర్ ఇంట్లోకి ముఖానికి మాస్కులు పెట్టకుని దుండగులు వచ్చారు. వైద్యుడి భార్య, కుమార్తెపై దాడి చేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. ఆ తరువాత కాళ్లు చేతులు కట్టేసి ఒక గదిలో బంధించారు. బీరువా తాళం చెవులు తీసుకుని రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో నలుగురు దుండగులు మాస్క్ లతో వచ్చి దొంగతనం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాస్ పరిశీలించారు. తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.

You might also like