FbTelugu

గోల్డ్ ఈటీఎఫ్ ల్లో భారీగా పెట్టుబడులు

ముంబై: డబ్బులు బయటకు ఇస్తే మళ్లీ వస్తాయో రావోనన్న బెంగతో పలువురు బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. గోల్డ్ ఎక్చేంజి ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. గత నెలతో సరిపోల్చితే రూ.921 కోట్లు పెరిగాయి.

అసోసియేషన్ ఆఫ్ మ్యుచవల్ ఫండ్స్ ఇన్ ఇండియా లెక్క ప్రకారం గోల్డ్ ఈటీఎఫ్ విభాగంలో అసెట్ అండర్ మేనేజిమెంట్ జూలై 31వ తేదీ నాటికి రూ.12,941 కోట్లు గా ఉంది. జూన్ నెలతో పోల్చితే జూలైలో అసెట్ అండర్ మేనేజిమెంట్ 19 పెరుగుదల కన్పిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి వరుసగా పెట్టుబడులను గమనిస్తే జనవరిలో రూ.202 కోట్లు, ఫిబ్రవరిలో 1,483 కోట్లు, మార్చిలో రూ.195 కోట్లు, ఏప్రిల్ లో రూ.731 కోట్లు, మే నెలలో రూ.815 కోట్లు పెట్టుబడి రూపంలో పెట్టారు.

You might also like