FbTelugu

 30 వేలు కడితే 7లక్షలు మీవే.. అంటూ భారీ మోసం

చిత్తూరు : తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తికి వచ్చిన అన్ నౌన్ కాల్ ఏకంగా రూ.16.50 లక్షలకు కుచ్చుటోపి పెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దుర్గానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న సందీప్‌ కిషోర్‌ అనే వ్యక్తి చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి ఓ అన్ నౌన్ ఫోన్ కాల్ వచ్చింది. మీరు మధ్యలో ఆపేసిన ప్రీమియం డబ్బు మొత్తం తిరిగి రావాలంటే రూ.60 వేలు కడితే రూ.3.20 లక్షలు వస్తాయని తెలిపారు.

నిజమేనని నమ్మిన సందీప్ డబ్బు ఆన్ లైన్ లో కట్టేశాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఇంకో ఫోన్ వచ్చింది. ఇంతకు ముందు మీరు చెల్లించిన రూ.60 వేలతో కలిపి మీ బీమా సొమ్ము రూ.7 లక్షలకు మెచ్యూర్‌ అయ్యింది. మరో రూ.30 వేలు కడితే జీఎస్టీ క్లియరెన్స్‌ చేస్తే ఆ డబ్బు మీదే అంటూ చెప్పడంతో మళ్లీ కట్టేశాడు. ఇలా ఉన్న, లేని ట్యాక్సుల పేరుతో గత నాలుగేళ్లుగా సుమారు రూ.16.50 లక్షలు గుంజుకున్నారు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన సందీప్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.