FbTelugu

విశాఖ పరవాడ ఫార్మాసిటీలో భారీ పేలుడు

విశాఖపట్నం ఫార్మా సిటీలో ఇవాల భారీగా పేలుడు సంభవించింది. రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో ఈ పేలుడు సంభవించింది. ప్రస్తుతం భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ అగ్ని ప్రమాదంతో ఆ పరిసర ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురౌవుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంటలు ఎగసిపడుతున్న ప్రదేశంలో ఇప్పటికి 17సార్లు భారీ పేలుళ్లు సంభవించినట్టు సమాచారం.

ఓ పది మందికి తీవ్రగాయాలైనట్టు తెలుపుతున్నారు. ఫార్మసిటిలో ప్రస్తుతం నైట్ షిఫ్ట్ లో 65 మంది ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు, పార్మాసిటీ లో మొత్తం 85 కంపెనీలు ఉన్నాయి. మంటలు అలాగే వ్యాప్తి చెందితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రానేలేదని అధికారులు తెలుపుతున్నారు. లోపల నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 12 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ మంటల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రమాద స్థలానికి కొంత దూరంలో ఉండే మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.