FbTelugu

గడిచిన 24 గంటల్లోనే 62,538 కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే దేశంలో 62,538 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 886 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

తాజాగా నమోదైన కొత్త కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,27,074 కి చేరింది. తాజా మరణాలతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 41,585 కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 6,07,384 కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకొని 13,78,105 మంది డిశ్చార్జ్ అయినారు.

You might also like