FbTelugu

యూఎస్ చరిత్రలో భారీ పరిహారం

వాషింగ్టన్: గతేడాది మిన్నియాపోలీసు లో శ్వేతజాతి పోలీసు అధికారి చేతి మరణించిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి అమెరికా ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటించింది.

జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి రూ.196 కోట్లు నష్ట పరిహారంగా చెల్లించనున్నట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ సమాచారాన్ని మిన్నెసొటా నగర అడ్వకేట్లు ఫ్లాయిడ్ కుటుంబానికి తెలిపారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద ప్రీ ట్రయల్ సెటిల్ మెంట్ అని అడ్వకేట్లు పేర్కొన్నారు. గతేడాది మే 25న ప్లాయిడ్ ను అదుపులోకి తీసుకునే క్రమంలో శ్వేతజాతి పోలీసు డెరెక్ చౌవిన్ అత్యంత క్రూరంగా వ్యవహరించాడు. సాధారణ నిందితుడి పట్ల వ్యవహరించాల్సిన విధంగా కాకుండా తీవ్రవాది పట్ల వ్యవహరించే తీరుగా ప్రవర్తించడం విమర్శలకు దారితీసింది. అతన్ని కిందపడేసి మెడపై తన కాలితో చాలాసేపు నొక్కొపట్టడం మూలంగా ఊపిరి ఆడక ప్రాణాలు విడిచాడు. ఊపిరి ఆడడం లేదని ఫ్లాయిడ్ అరిచినా కనికరం లేకుండా డెరెక్ ప్రవర్తించడం, అక్కడున్నవారు కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దారుణ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.

ఈ ఘటనపై ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు గత ఏడాది జూలైలో మిన్నెసొటా కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో మిన్నియా పోలీసులు కోర్టు బయట పరిష్కరించుకుందామని చెప్పి ఫ్లాయిడ్ కుటుంబాన్ని ఒప్పించింది. ఇరు వర్గాల అంగీకారం మేరకు రూ.196 కోట్లు నష్ట పరిహారం చెల్లించనున్నారు. ఈ పరిహారం చెల్లింపు తరువాత నల్లజాతీయులపై శ్వేతజాతీయులు దౌర్జన్యానికి దిగాలంటే ఆలోచించాల్సి ఉంటుందని ఫ్లాయిడ్ సోదరుడు రోడ్నీ తెలిపారు. తప్పుడు మరణానికి న్యాయం జరిగిందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.