FbTelugu

వాట్సప్ కు గట్టిగా జవాబిచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో వాట్సప్ తన వినియోగదారుల డేటాను యాడ్స్, మార్కెటింగ్ కోసం తన పేరెంట్ సంస్థ అయిన ఫేస్ బుక్ తో షేర్ చేసుకోవడానికే ప్రైవసీ పాలసీ రూపొందిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం ఆక్షేపించింది.
తప్పుడు వార్తలు, బూటకపు ప్రచారాన్ని కట్టడి చేయడానికి, శాంత్రిభద్రతలను కాపాడేందుకు రూపొందించిన నిబంధనలను ఆమోదించేందుకు తిరస్కరిస్తోందని కేంద్రం స్పష్టం చేసింది. నూతన ఐటి నిబంధనలను సవాల్ చేసిన వాట్సప్ కు కేంద్ర ప్రభుత్వం గట్టిగా జవాబు ఇచ్చింది. కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, దేశంలో ప్రజలందరి వ్యక్తిగత గోప్యతా హక్కును పరిరక్షించేందుకే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒక వార్త లేదా ప్రకటన మొదటిసారి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి షేర్ అయ్యింది వంటి వివరాలను తెలియచేయాలని వాట్సప్ ను కోరామంటే… చాలా తీవ్రమైన నేరాల నిరోధం, దర్యాప్తు, శిక్ష విధించడం కోసమేనని ఆయన చెప్పారు.

దేశ భద్రత, సార్వభౌమాధికారం, నేరాల నిరోధానికే మెస్సేజి మూల స్థానం గురించి తెలియచేయాలని అడుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. అత్యాచారాలు, లైంగిక దోపిడి, బాలలపై నేరాకలు సంబంధించిన పోస్టులను నిరోధించేందుకు, నేరగాళ్లను శిక్షించేందుకు వాట్సప్ నుంచి సమాచారం కోరుతున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.