FbTelugu

అద్దెలే కట్టవద్దని.. ఇంత కరెంటు బిల్లులేంటీ ? : కోమటిరెడ్డి

నల్లగొండ : కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో ఇంటి అద్దెలనే కట్టవద్దన్న కేసీఆర్.. ఇప్పుడు లాక్ డౌన్ లో వాడిన కరెంటుకు స్లాబుల పేరుతో పేదలనుంచి వేలల్లో వసూలు చేయడం ఏంటని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రశ్నించారు.

రాష్ట్రంలో కరెంటు బిల్లులపై నిరసన తెలిపేందుకు నేడు ‘చలో సెక్రటేరియర్’ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాగా కోమటి రెడ్డి వెంకటరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మూడు నెలలు ఉపాధి లేని ప్రజలు బిల్లులెలా కడతారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దారుణమన్నారు.

You might also like