FbTelugu

ఎమ్మెల్యే పౌరసత్వం పై కేంద్రం పెత్తనమేంటి: అడిషనల్ ఏజీ వాదన

హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం పై హైకోర్టు ఇవాళ విచారణ జరిగింది. ఆయన పౌరసత్వం పై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ధాఖలు చేసింది. వారం రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కేంద్రం కోరింది.
రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం మరోసారి కోర్టుకు తెలిపింది. చెన్నమనేని పౌరసత్వంపై ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఆది శ్రీనివాస్ కేసు వేశారు. ఇవాళ హైకోర్టులో విచారణ జరగ్గా… అసలు ఈ పౌరసత్వం పై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదని తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు వాదించారు. ఆయన తెలంగాణలోనే ఉన్నాడని, దేశంలోనే నివసిస్తున్నాడని కోర్టుకు తెలిపారు. రమేష్ రెండు దఫాలుగా వేములవాడ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గా ఎన్నిక అయి ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు.

ఈ కేసులో కావాల్సిన డాక్యుమెంట్లు రాష్ట్ర ప్రభుత్వం అందించిందని, విచారణ మరో నెల రోజులు వాయిదా వేయాలని కోరారు. భౌతిక విధానం ద్వారా కేసు విచారించాలని రామచందర్ రావు కోరారు. మొదటి సారిగా ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం స్పందించిందని హైకోర్టుకు ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది తెలిపారు. పిటిషన్ పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలపడంతో తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.