FbTelugu

షర్మిల సభకు ఎలా అనుమతించారు: మాజీ ఎంపి విహెచ్

హైదరాబాద్: కరోనా తో ప్రజలు భయబ్రాంతులకు గురవుతుంటే వైఎస్.షర్మిల సంకల్ప సభకు ఎలా అనుమతి ఇస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని మాజీ ఎంపి వి.హన్మంతరావు ప్రశ్నించారు.

హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు ఇవాళ రోడ్ల మీద రోడ్ షో లు ఎందుకు అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. హన్మంత రావు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, డిజిపి మహేందర్ రెడ్డి ఎందుకు అనుమతి ఇచ్చారో తెలియడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వెళ్లినా అనుమతి ఇవ్వరు కాని షర్మిలకు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. అయిన వాళ్లకోక న్యాయం మాకొక న్యాయమా? అని మండిపడ్డారు. తెలంగాణలో ఆంధ్ర ఓట్లను కొల్లగొట్టేందుకు బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు ఆడిస్తున్న నాటకమని, అందులో షర్మిల పావు అని హన్మంతరావు ఆరోపించారు.

షర్మిల ఏమైనా పోరాటం చేయాలనుకుంటే ఆంధ్రా లో చేసుకోవాలని ఆయన హితవు పలికారు. వైఎస్.రాజశేఖర రెడ్డి భార్య వైఎస్.విజయ లక్ష్మీ ఆంధ్రా లో కొడుకు,తెలంగాణలో కూతురు రాజ్యమేలాలని భావిస్తుందా అని ఎద్దేవా చేశారు. షర్మిల కేవలం రాజశేఖర రెడ్డి కూతురు మాత్రమే అంతకు మించి ఏమి అర్హతలు లేవన్నారు. సోనియా గాంధీ ఆదేశంతోనే వైఎస్ఆర్ రాష్ట్రంలో పథకాలు అమలు చేశారని, ఆయన సొంతం కాదని హన్మంతరావు స్పష్టం చేశారు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు, ఆంధ్రులకు కూడా తెలుసునని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.