FbTelugu

మార్చురీలోకి రియా ఎలా వచ్చింది: సీబీఐ

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. నటి రియా చక్రవర్తిని మార్చురీ గదిలోకి ఎవరు అనుమతించారనే కోణంలో లోతుగా విచారిస్తున్నారు.

పోస్టుమార్టం పారదర్శకంగా జరిగిందా లేదా అనే కోణంలో వైద్యులను విచారించాలనే నిర్ణయానికి వచ్చారు. మొత్తం ఐదుగురు సభ్యుల వైద్యల బృందం సుశాంత్ మృతదేహాన్ని పోస్టుమర్టం చేశారు. ఈ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు, సంబంధం లేని వాళ్లు ఎవరు వచ్చారనేది తెలుసుకోనున్నారు.

మార్చురీ గదిలోకి రియాను ఎందుకు అనుమతించారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారనే దానిపై వివరాలు సేకరించనున్నారు.

You might also like